PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సేవ చేయడం…అదృష్టం..

1 min read

ప్రముఖ కార్డియాలజిస్ట్​ డా. చంద్రశేఖర్​ యాదవ్​

పల్లెవెలుగు వెబ్​: ఎన్నో ఆశలు.. ఆకాంక్షలతో ..కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టిన యువతకు… శ్రేయోభిలాషులకు…మిత్రులకు కర్నూలు హార్ట్​ ఫౌండేషన్​ తరుపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ప్రముఖ కార్డియాలజిస్ట్​ డా. చంద్రశేఖర్​ యాదవ్​. న్యూ ఇయర్​ ప్రారంభమైన సందర్భంగా.. కర్నూలు నగరంలోని పుల్లారెడ్డి ఇంజనీరింగ్​ కాలేజి సమీపంలోని ‘హోమ్​ ఆఫ్​ పాప్​’  కేంద్రంలో ఆదివారం  వంద మంది పిల్లలకు అన్నదానం ఏర్పాటు చేశారు.  ఈ సందర్భంగా ప్రముఖ కార్డియాలజిస్ట్​ డా. చంద్రశేఖర్​ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా పిల్లలకు అన్నదానం ఏర్పాటు చేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. గత ఐదు సంవత్సరాలుగా హోమ్​ ఆఫ్​ పాప్​ కేంద్రంలో అన్నదానం ఏర్పాటు చేశామన్న డా. చంద్రశేఖర్​… పిల్లలకు బట్టలు, పుస్తకాలు,సబ్బులు, బ్యాగులు, నూనె తదితర వస్తువులను ఇచ్చేందుకు హార్ట్​ ఫౌండేషన్​ సంస్థ సిద్ధంగా ఉందన్నారు. అంతకు ముందు న్యూ ఇయర్​ సందర్భంగా పిల్లలతో కేక్​ కట్​ చేయించి…తినిపించారు. కార్యక్రమంలో కర్నూలు హార్ట్​ ఫౌండేషన్​ ట్రెజరర్​ రాముడు, సభ్యులు వెంకటరాముడు, కేశవ రెడ్డి, ఫాస్టర్​ తిమ్మోతి, హోమ్​ ఆఫ్​ పాప్​ ఇన్​చార్జ్​ ప్రమీల తదితరులు పాల్గొన్నారు.

About Author