మానసిక వికలాంగులకు సేవ చేయడం జన్మ సుకృతం: చిన్న జీయర్ స్వామి
1 min readపల్లెవెలుగు వెబ్:చెన్నూరు మానసిక వికలాంగుల కోసం పని చేయడం, వారి అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వడం, వారి సంరక్షణకు పాటుపడడం వల్ల వారి జన్మ సుకృతం అవుతుందని త్రిదండి చిన్న జీయర్ స్వామి అన్నారు, శనివారం సాయంత్రం మండలంలోని దౌలతా పురం( షుగర్ ఫ్యాక్టరీ) వద్ద కొండ పేట కు చెందిన రమణారెడ్డి తన సొంత భూమిలో మానసిక వికలాంగుల కొరకు భూమి పూజ గావించారు, అలాగే దీనికి శ వ న మానసిక వికలాంగుల కేంద్రం అని నామకరణం చేయడం జరిగింది, ఈ సందర్భంగా చిన్న జీయర్ స్వామి మాట్లాడుతూ, మానసిక వికలాంగుల కేంద్రం కొరకు భూమిని ఇచ్చిన రమణ రెడ్డి ని అభినందించారు, సమాజ సేవలో ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేపట్టడం గొప్ప విషయమన్నారు, అందులో మానసిక వికలాంగుల కొరకు సేవ చేయడం అనేది ఒక పుణ్య కార్యం గా భావించాలి అని ఆయన అన్నారు, ఈ కార్యక్రమం ద్వారా మానసిక వికలాంగుల భవిష్యత్తు కు, వారి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు, ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా , మరొకరికి ఆదర్శంగా నిలవడం జరుగుతుందన్నారు, ఒక మంచి కార్యం తలపెట్టినప్పుడు , వారికి అన్ని వేళల శుభాలు జరుగుతాయని ఆయన అన్నారు, ఈ కార్యక్రమంలో అలంఖాన్ పల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానం వ్యవస్థాపకులు, మధుసూదన్ రెడ్డి, కడప మార్కెట్ యార్డ్ చైర్మన్ జి ఎన్, భాస్కర్ రెడ్డి, ఎంపీపీ చిర్ల సురేష్ యాదవ్, మండల ఉపాధ్యక్షులు, ఆర్ ఎస్ ఆర్ (చిన్న), మండల కో ఆప్షన్ నెంబర్, వారిస్, ఎంపీటీసీలు ఎర్ర సాని నిరంజన్ రెడ్డి, రఘురాం రెడ్డి, వార్డు మెంబర్ టి ఎన్, మహేశ్వర్ రెడ్డి, ఉమా మహేశ్వర్ రెడ్డి, కుమార్ రెడ్డి, మండల సమరసత సేవా సంఘం అధ్యక్షుడు గురు ప్రసాద్ రెడ్డి, , బుజ్జి రెడ్డి, మైనార్టీ నాయకులు హస్రత్, శ్రీనివాసుల రెడ్డి ,శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.