బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు….
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: యం.డి.హళ్లి గ్రామంలో వినాయక చవితి సందర్బంగా సర్పంచ్ సుధాకర్ ఆధ్వర్యంలో గోపి చారిటబుల్ ట్రస్ట్ వారికి బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది .. గ్రామస్థులు చుట్టూ పక్కన గ్రామాల ప్రజలు స్వచ్ఛందగా వచ్చి రక్త దానం చేయడం జరిగింది . ఈ కార్యక్రమానికి RCC ప్రధాన కార్యదర్శి రాజన్న మాట్లాడుతూ అన్ని దానాల్లోకెల్లా రక్త దానం గొప్పదని , ప్రతి ఒక్కరు రక్త దానం చేయాలనీ తెలిపారు … పెద్ద గోనేహాల్ ప్రేమార్దం రెడ్డి మాట్లాడుతూ సంవత్సరానికి 4 సార్లు రక్త దానం చేయొచ్చని ప్రతి ఒక్కరు రక్త దానం గురించి తెలుసుకోవాలని మన రక్తం ఇంకొకరి కి జీవాన్ని పోస్తుందని తెలిపారు . సర్పంచ్ సుధాకర్ మాట్లాడుతు ఎవరికి ఎప్పుడు , ఎక్కడ రక్తం అవసరమవుతుందో తెలీదు మనం రక్త దానం చేయడం వాళ్ళ కొన్ని ప్రాణాలను మిగిలించిన వాళ్లవుతాము , రక్త దానం వేరే వాళ్లకు అవగాహనా కలిగించి రక్త దానాలను పెంచాలని తెలిపారు .ఈ కార్యక్రమంలో గోపి చారిటబుల్ ట్రస్ట్ వారు ,వందవాగిలి సర్పంచ్ శేషన్న , ప్రజా సేవకుడు విరూపాక్షి , M.d.halli యూత్ యువసేన నాయకుడు ఖాదర్ బాషా , శివ , పరమేష్ , పెద్ద కొండయ్య , అభిషేక్ , చిన్న స్వామి,సంపత్ తదితరులు పాల్గొన్నారు.