కరెంట్ పోల్ ను ఢీకొన్న కారు.. ఏడుగురు మృతి
1 min readపల్లెవెలుగు వెబ్ : బెంగళూరులోని కోరమంగళలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ఘటనలో ఏడుగురు ప్రమాణీకులు అక్కడికక్కడే మృతి చెందారు. కరెంటు స్తంభాన్ని ఢీకొనడంతో కారులో మంటలు చెలరేగాయి. దీంతో కారులోని ముగ్గురు మహిళలతో సహా ఏడుగురు మృతి చెందారు. ప్రమాదానికి గల పూర్తీ వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికుల్ని భయబ్రాంతులకు గురిచేసింది. అక్కడికక్కడే ఏడుగురు విగతజీవులుగా మారడంతో స్థానికులు నిశ్చేష్టులై చూస్తూ ఉండిపోయారు.