తాలిబన్ల కాల్పులతో తొక్కిసలాట..ఏడుగురి మృతి
1 min readపల్లెవెలుగు వెబ్ : ఆఫ్ఘన్ లోని కాబూల్ విమానాశ్రయం మరోసారి రక్తమోడింది. కాబూల్ ఎయిర్ పోర్ట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు మరణించారు. దేశం విడిచివెళ్లేందుకు పెద్ద సంఖ్యలో ఆప్ఘన్ పౌరులు ఎయిర్ పోర్టు వద్దకు చేరుకున్నారు. వీరిని చెదరగొట్టేందుకు తాలిబన్లు కాల్పులు జరిపారు. దీంతో ఆప్ఘన్ పౌరులు పరుగులు పెట్టారు. ఈ తొక్కిసలాటలో ఏడుగురు మరిణించారు. మరణించిన ఏడుగురు ఆప్ఘన్ పౌరులే. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. తాలిబన్లు ఒకవైపు స్వేచ్చా గీతం పాడుతూనే.. నరమేధం సృష్టిస్తున్నారు. తాలిబన్ల ప్రకటనలకు.. వారు చేస్తున్న పనులకు పొంతన లేకుండా పోయింది. మహిళలపై తీవ్ర ఆంక్షలు అమలు చేస్తున్నారు. మహిళలను సెక్స్ బానిసలుగా మారుస్తున్నారు. మహిళా ఉద్యోగుల్ని విధులకు హాజరుకానివ్వడంలేదు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆప్ఘన్ పౌరులు దేశం విడిచి వెళ్లేందుకు కాబూల్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటున్నారు.