PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి- ఏపీయుడబ్ల్యూజే

1 min read

పల్లెవెలుగు వెబ్ వెలుగోడు :  జర్నలిస్ట్ ల పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఏపీయుడబ్ల్యూజే జిల్లా కమిటీ సభ్యులు ఎస్.రఘు రాముడు యాదవ్ , టిడిపి నాయకులు     హిదయతుల్లా , సిపిఎం నాయకులు రాజశేఖర్ , జనసేన నాయకులు శాలు బాషా , ఎస్డీపిఐ నాయకులు హుసేన్ బాషా డిమాండ్ చేశారు. వెలుగోడు పట్టణంలోని పొట్టిశ్రీరాములు సెంటర్లో ఏపీయూడబ్ల్యుజె జర్నలిస్టులు , ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో మానవ హారంగా ఏర్పడి జర్నలిస్ట్ లపై జరుగుతున్న దాడులకు నిరసనగా రాస్తోరోకో నిర్ణయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  రాష్ర్టంలో పత్రికా స్వేచ్ఛకు తిలోదకాలు ఇచ్చి , జర్నలిస్ట్ లపై , కార్యాలయంపై వైఎస్ ఆర్ పార్టీ నాయకులు  దాడులకు పాల్పడుతున్నారని , ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలి పెట్టు లాంటిదని అన్నారు.రాప్తాడులో సిద్ధం సభలోముఖ్యమంత్రి మాట్లాడుతున్నపుడే ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాపర్ కృష్ణ పై వికక్షణ రహితంగా దాడులు చేశారని అన్నారు.దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఆతర్వాత ర్యాలీ గా తహసిల్దార్ కార్యాలయం వరకు వెళ్లి తహశీల్దార్ విజయ కుమారి  కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాజీ సర్పంచ్ అబ్దుల్ కలాం , సిఐటియు నాయకులు రఫీ, ఎస్డీపిఐ జిల్లా ఉపాధ్యక్షుడు లింకన్ రాజు , గిరిజన టైమ్స్ పత్రిక ఎడిటర్ లాలూ నాయక్  మాట్లాడుతూ . పత్రికల్లో వార్తలు వస్తే ఖండనలు ఇవ్వాలని ,లేదా కోర్టులో ఆశ్రయించాలని భౌతిక దాడులకు పాల్పడడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వానికే ప్రజలకు వారదులుగా పనిచేసే పోర్త్ఏ స్టేట్ అయిన జర్నలిజంపై దాడులకు పాల్పడడం సమంజసం కాదన్నారు. ఈనాడు కార్యాలయం పై దాడి చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో  సూర్య చంద్ర శేఖర్ , ఏబీఎన్ చాంద్ బాషా ,  తెలుగు వార్త నాజీర్ , దేశ పోరాటం రాఘవేంద్రరావు , పల్లె వెలుగు గోగుల రాము , టిడిపి నాయకులు,మొయినరసుల్ డా.జాకీర్ , ఖలీ లుల్లా , అమిర్హంజ , లాయర్ రవి సిపిఎం నాయకులు నాగేంద్రుడు  తదితరులు పాల్గొన్నారు.

About Author