PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘రెట్ట’ వేస్తాయ‌ని.. కోట్లాది ప‌క్షుల్ని చంపారా ?

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ‘`బ‌ర్డ్స్ ఆర్ నాట్ రియ‌ల్ ’ అనే సిద్ధాంతం అమెరికాలో బాగా పాపుల‌ర్ అయింది. సోష‌ల్ మీడియాలో ఈ సిద్ధాంతాన్ని న‌మ్మేవాళ్ల సంఖ్య పెరిగింది. ఈ పేరు మీద పెద్ద ఉద్యమ‌మే న‌డుస్తోంది. అసలు ’బ‌ర్డ్స్ ఆర్ నాట్ రియ‌ల్ ’ అంటే ఏమిటి ?. ఈ సిద్ధాంతం ఏం చెబుతోంది ?.
అమెరికాలో 1950 వ‌ సంవ‌త్సరంలో సిఐఏ పూర్తీ స్థాయిలో దేశవ్యాప్తంగా నిఘా ఏర్పాటు చేయాల‌ని భావించింద‌ట‌. భ‌ద్రతా సిబ్బంది, సిసి కెమెరాల‌తో ప‌ర్యవేక్షించినా.. కొంత ప‌రిధి వ‌రకే ర‌క్షణ క‌ల్పించ‌గ‌ల‌మ‌ని సిఐఏ భావించింద‌ట‌. ప్రజ‌ల‌కు ఎలాంటి అనుమానం రాకుండా.. ప్రకృతిలో మ‌మేక‌మైన ప‌క్షుల్ని చంపి.. వాటి స్థానంలో రోబో ప‌క్షుల‌ను ప్రవేశ‌పెట్టాల‌ని సిఐఏ నిర్ణయించింద‌ట‌. ఇందుకోసం సిఐఏ భారీ ఆప‌రేష‌న్ చేప‌ట్టింద‌ని ఈ సిద్ధాంతం న‌మ్మే వారు చెబుతారు.

ప‌క్షుల‌ను చంప‌డానికి కార‌ణం :
ప‌క్షుల‌తో పాటు.. రోబో ప‌క్షుల‌ను ప్రకృతిలో ప్రవేశ‌పెట్టవ‌చ్చు. ప్రత్యేకంగా ప‌క్షుల్ని చంపాల్సిన ప‌నిలేదు. పక్షుల‌ను చంప‌డానికి గ‌ల కార‌ణం.. ఖ‌రీదైన కార్ల పై ఆ ప‌క్షులు రెట్ట వేస్తున్నాయ‌ని, అందుకే వాటిని చంపాల‌ని సీఐఏ నిర్ణయించింద‌ని ఈ సిద్ధాంతం న‌మ్మే వారి వాద‌న‌. 1959 నుంచి 2001 వ‌ర‌కు అమెరికా వ్యాప్తంగా 12 బిలియ‌న్ ప‌క్షలను చంపి .. వాటి స్థానంలో రోబో ప‌క్షుల్ని తీసుకొచ్చార‌ని ‘ బ‌ర్డ్స్ ఆర్ నాట్ రియ‌ల్ ’ సిద్దాంతం న‌మ్మేవారు న‌మ్ముతారు. ఈ రోబో ప‌క్షులు వాటంత‌ట అవే విద్యుత్ లైన్స్ పై కూర్చుని చార్జింగ్ చేసుకుంటాయ‌ని చెబుతారు.
సోష‌ల్ మీడియా ఉద్యమం :
బ‌ర్డ్స్ ఆర్ నాట్ రియ‌ల్ అనే వెబ్ సైట్ లో పూర్తీ వివ‌రాల‌ను పొందుప‌రిచారు. ఎలాంటి వాస్తవాలు లేకున్నా.. కొన్ని సంద‌ర్భాల‌ను, వార్తల‌ను క‌లిపేసి ఈ సిద్ధాంతాన్ని సృష్టించార‌ని కొంద‌రు వాదిస్తారు. సోష‌ల్ మీడియాలో ఈ సిద్ధాంతం బాగా పాపుల‌ర్ అయింది. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాలో ఈ సిద్దాంతానికి ఫాలోవ‌ర్లు పెరిగారు. లాక్ డౌన్ స‌మ‌యంలో అంతా సోష‌ల్ మీడియలో ఎక్కవ స‌మ‌యం గ‌డ‌ప‌డంతో ఈ సిద్ధాంతం బాగా పాపుల‌ర్ అయింది.

About Author