‘”ప్రత్తి లో గులాబీ రంగు పురుగు కు లింగాకర్షక బుట్టలే శరణ్యం”
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: జిల్లా ఏరువాక కేంద్రం, నంద్యాల, ప్రిన్సిపల్ సైంటిస్ట్ (సస్యరక్షణ) డా. ఎ.రామకృష్ణా రావ్, మండల వ్యవసాయ అధికారి, ఇ . హేమ సుందర్ రెడ్డి ఆర్.బి.కె. వి.ఏ.ఏ, జ్యోత్స్న, మంజుల కలిసి గడివేముల మండలం లోని బూజునూరు, బిలకల గూడూరు, గడివేముల గ్రామలలోని ‘సమస్యాత్మక ప్రత్తి పంట పొలాల’ ను సందర్శించి రైతులకు సలహాలు ఇచ్చారుప్రస్తుతం రసం పీల్చు పురుగులు ( పచ్చ దోమ, తామర పురుగులు) మరియు వేరు కుళ్ళు తెగులు ఆశించి నష్టం కలుగ చేస్తున్నట్లు తెలిపారు పసుపు, నీలి రంగు జిగురు అట్టలను పొలంలో పెట్టుకోవాలని అవసరాన్ని బట్టి రసాయన పురుగు మందులయిన ఎకరానికి ఇమిడాక్లోప్రిడ్ 80మి.లీ లేదా ఎసిటామిప్రిడ్ 40గ్రా లేదా దయోమిధాక్జమ్ 40గ్రా/ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలని రైతులకు సూచించారు.గులాబీ రంగు పురుగు నివారణకు గాను లింగా కర్షక బట్టలే శరణ్యమని, కావున లింగాకర్షణ బుట్టలను ఏకరానికి 20 చెప్పున పత్తి పంటలు సాగుచేసిన రైతులందరూ పెట్టుకోవాలని డా. ఎ.రామకృష్ణా రావు ప్రిన్సిపల్ సైంటిస్ట్ రైతులకు సూచించారు.