మార్చి 7న షబేబరాత్…
1 min read– నమాజు సమయంలో మార్పులు చేయండి:- మసీదు ముతవల్లిలకు ముస్లిం మత పెద్దల సూచన
పల్లెవెలుగు వెబ్ ఆదోని: ఆదోని పట్టణం మరియు గ్రామాల్లో ఉన్న మసీదు మూతవల్లి లకు మత పెద్ద ఖాజి సాబ్, ఖతీబ్ జునైద్, ముఫ్తి ఆసీఫుద్దీన్ ఖాద్రి, సయ్యద్ మక్ధూమ్ గారు పాలు సూచనలు చేశారు. రానున్న షబే బరాత్(పెద్ద రాత్రి) రోజున రాత్రి ఇషా నమాజు ఒకే సమయంలో కాకుండా రాత్రి తొమ్మిది గంటల నుంచి 11 మధ్యలో తమకు అనుకూలమైన సమయంలో జమాత్ పెట్టుకోవాలని సూచించారు.గతంలో అందరూ రాత్రి 10 గంటలకు పెట్టుకునే వారని..దీని కారణంగా ఒక వేళ ఎవరైనా ఆ సమయంలో చేరుకోకపోవడంతో ప్రార్థన కు దూరమయ్యేవరని. వృద్దులకు కూడ అంత సమయం వరకు వేచి చూడాల్సి వచ్చేదని. సమయంలో మార్పులు చేస్తే అందరికి అనుకూలంగా ప్రజలకు మేలు చేసే విధంగా ఉంటుందన్నారు.అలాగే తల్లిదండ్రులు తమ పిల్లలను రాత్రి సమయంలో అనవసరంగా బయట తిరిగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు యువత కూడ ఎవ్వరికీ ఇబ్బంది కలగించవద్దని ..పోలీసు వారికి సహకరించాలని కోరారు.