అర్ధాంతరంగా నిలిచిపోయిన షాదీఖానా పనులు..
1 min read– కమ్యూనిటీ భవనం , షాదీఖాన భవనం త్వరగా పూర్తి చేయాలి.
– గత ప్రభుత్వాల హాయంలో మంజూరైన రూ. కోటి 56 లక్షల నిధులు ఎక్కడ.
– చోద్యం చూస్తున్న అధికారులు
– పనులు మొదలుపెట్టని కాంట్రాక్టర్లు.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు పట్టణం నందు కేజీ రోడ్డు నందు గల షాదీఖానా మరియు కమ్యూనిటీ భవన్ నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా అసెంబ్లీ ఇన్చార్జ్ ఉస్మాన్ అన్నారు. సోమవారం ఆయన పనులను పరిశీలించారు. అనంతరము ఆయన మాట్లాడుతూ ఆత్మకూరు రోడ్డు నందు సుమారు 82 సెంట్ల స్థలమును గత ప్రభుత్వము ముస్లిం మైనార్టీల కొరకు కేటాయించింది.కానీ ఆ స్థలము అక్రమార్కుల చేతిలోకి పోకుండా గత ప్రభుత్వాలు చొరవ తీసుకుని ఆ స్థలమునకు అప్పటి ఎమ్మెల్సీ గేయానంద్ నిధులతో ప్రహరీ గోడను నిర్మించారన్నారు. నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి హాయంలో భవన నిర్మాణము మరియు మైనార్టీ సంక్షేమ శాఖ నుండి దాదాపు ఒక కోటి 56 లక్షల నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.గత నాలుగు సంవత్సరాల కిందట నిర్మాణము ప్రారంభమై అర్ధాంతరంగా ఆగిపోవడంతో ముస్లిం మైనార్టీ ప్రజలు మంజూరైన నిధులు వెనక్కి వెళ్లిపోయాయని ఆందోళన చెందుతున్నారు. కావున ఈ నిర్మాణాన్ని తక్షణమే ప్రారంభించాలని ఎస్ డి పి ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్.డి.పి.ఐ అసెంబ్లి కార్యదర్శి బషీర్,పట్టణ అధ్యక్షడు అస్లామ్,కార్యదర్శి ఖలీల్,జిల్లా సభ్యుడు అన్వర్,హనుమంతు,రఫి,ఆరీఫ్ తదితరులు పాల్గొన్నారు.