నిబంధనలు లేకుండా షాదితోఫా కొనసాగించాలి..
1 min readపల్లెవెలుగు, వెబ్ నందికొట్కూరు: నిరుపేద ముస్లిం మైనార్టీల కొరకు అక్టోబర్ 1వ తేదీ నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన షాదితోఫాను ఎటువంటి నిబంధనలు లేకుండా కొనసాగించాలని ఆవాజ్ కమిటీ డివిజనల్ కార్యదర్శి అబ్దుల్ రహిమాన్ పేర్కొన్నారు. మంగళవారం ఆవాజ్ కమిటీ పట్టణ కోశాధికారి మహబూబ్ బాషా అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ వధూవరులు పదవతరగతి చదువుకుని ఉంటేనే షాదీతోఫా పొందడానికి అర్హులని నిబంధనలు పెట్టడంతో 90 శాతం మంది నిరుపేదలు షాదితోఫాకు అనర్హులుగా ఉండిపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాలలో ఉర్దూ చదువుకున్న అమ్మాయిలు పదవ తరగతి కోసం పట్టణాలకు రాలేక మరియు పట్టణాలలో ఉన్న ఉర్దూ ఉన్నత పాఠశాలలలో తగిన ఉర్దూ టీచర్లు లేనందున మధ్యలోని చదువును ఆపివేసి ఉన్నారని ఇటువంటి వారందరూ షాదీతోఫా అందుకోలేరని దీనివల్ల ముస్లిం సమాజం అసహనంతో ఉందని అన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి ముస్లింలకు మంచి చేయాలనుకుంటే ఎటువంటి నిబంధనలు లేకుండా నిరుపేదలు అందరికీ షాదీ తోఫా అందేటట్లు ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్ కమిటీ పట్టణ నాయకులు షఫీ, ఆదం, నూర్ అహ్మద్, హకీమ్ తదితరులు పాల్గొన్నారు.