షారుక్ కొడుకు కేసు.. లాయర్ ఫీజు ఎంతో తెలుసా ?
1 min readపల్లెవెలుగు వెబ్ : బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడు. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ ను ఎన్సీబీ ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ముకుల్ రోహత్గీని తన న్యాయవాదిగా నియమించుకున్నారు. బాంబే హైకోర్టులో ఆర్యన్ బెయిల్ పిటిషన్ పై ఆయనే వాదిస్తున్నారు. ఒకసారి కోర్టుకు హాజరుకావడానికి ముకుల్ రోహత్గీ 10 లక్షల రూపాయలు తీసుకుంటారని సమాచారం. మహారాష్ట్ర ప్రభుత్వం తరపున బీహెచ్. లోయ కేసు వాదించడానికి 1.21 కోట్లు తన పారితోషికంగా తీసుకున్నారని ఒక ఆర్టీఐ అప్లికేషన్ ద్వార వెల్లడైంది. ముకుల్ రోహత్గీ సోలిసిటరల్ జనరల్ గా పనిచేశారు.