కార్తీక మాసోత్సవాలకు శైవ క్షేత్రాలు ముస్తాబు
1 min readపల్లెవెలుగు, వెబ్ చెన్నూరు: కార్తీక మాసోత్సవాలు లో భాగంగా చెన్నూరు పెన్నా నది ఒడ్డున వెలసిన శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయం. చెన్నూరు బస్టాండ్ వద్ద ఉన్న శ్రీ లలితాంబికా సమేత నాగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక శుద్ధ పాడ్యమి నుండి కార్తీక బహుళ అమావాస్య వరకు అనగా ఈనెల 26 నుంచి వచ్చేనెల 23వ తేదీ వరకు కార్తీక మాస ఉత్సవాలు నిర్వహించేందుకు ఆలయ కమిటీ నిర్వాహకులు ఏర్పాట్లు ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో నాలుగు సోమవారములు మరియు కార్తీక పౌర్ణమి రోజు శివ పూజలు ఏర్పాటు చేశారు. కార్తీక మాసం ప్రతిరోజు తెల్లవారుజామున గోపూజ ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించనున్నారు. నాలుగవ సోమవారం శివపార్వతుల కళ్యాణం నిర్వహిస్తున్నారు. అలాగే శ్రీ లలితాంబికా సమేత నాగేశ్వర స్వామి ఆలయంలో 4వారాలపాటు కార్తీక పౌర్ణమి రోజు ప్రత్యేక అభిషేక పూజలు ఏర్పాటు చేశారు. రెండు ఆలయాల్లో 26వ తేదీన సాయంత్రం 05:45 నిమిషాలకు ఆకాశదీపం ఆరోహణ చేయనున్నారు. ప్రతిరోజు తెల్లవారుఝామున నాలుగు గంటలకే ఆలయాల్లో అభిషేక పూజలకు ఏర్పాటు చేశారు. ఆలయాల ఎదుట చలువ పందిళ్లు ఏర్పాటు చేసి ఆలయ ఉన్న విద్యుత్ దీపాలతో అలంకరించారు. చెన్నూరు మండలం లో శివాలపల్లి గ్రామ పరిధిలో ఉన్న కాశీ విశ్వనాథ్ ఆలయం, ఉప్పరపల్లి గ్రామ పరిధిలో ఉన్న ఉమా మహేశ్వర స్వామి, రామన పల్లి గ్రామంలో ఉన్న శ్రీ గౌరీ మల్లేశ్వర ఆలయం, బలిసిగన పల్లి పరిధిలో నల్లమల అడవుల్లో వెలసిన కైలాసగిరి కోనలో సిద్దలింగేశ్వర స్వామి ఆలయం,కొక్కరాయ పల్లి పెన్నా నది ఒడ్డున వెలసిన శివాలయం కార్తీక మాసోత్సవ లకు ఏర్పాట్లు చేస్తున్నారు.