PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శాకాంబరి దేవిగా… శ్రీ మహాగౌరి అమ్మవారు

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: కర్నూలు జిల్లా కేంద్రంలోని శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఆదివారం శ్రీ మహాగౌరి అమ్మవారు శాకాంబరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆషాఢమాసం పురస్కరించుకుని..  పరమ పూజ్య శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ, శ్రీ శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారల దివ్య ఆశీస్సులతో కర్నూలు శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో  భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.  మహాగౌరీ అమ్మవారి అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్ధం, అమ్మవారి ప్రీత్యర్థం… వేదపండితులు శ్రీ లలితా సహస్రనామ పూర్వక సామూహిక లక్ష కుంకుమార్చన నిర్వహించారు. కార్యక్రమంలో పత్తికొండ ఎమ్మెల్యే  కంగాటి శ్రీదేవి కుటుంబ సభ్యులు, మాతృ మండలి సభ్యులు మరియూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.  అర్చన అనంతరం భక్తులకు అమ్మవారి ప్రసాద వితరణ చేయడమైనది.

About Author