హిందీలో మాట్లాడాలంటే వణుకు
1 min readపల్లెవెలుగువెబ్ : హిందీ మాట్లాడాలంటే తనకు వణుకు పుడుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అందుకే హిందీలో మాట్లాడాలంటే సంకోచిస్తానన్నారు. ముంబైలో హిందీ వివేక్ మేగజైన్ నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఓ వక్త నిర్మలను హిందీలో ప్రసంగించాలని కోరారు. దాంతో నిర్మల తనకు హిందీ అంటే ఎందుకు భయమో వివరించారు. తాను పుట్టి పెరిగింది హిందీ వ్యతిరేక ఉద్యమం జరిగిన తమిళనాడులో అని గుర్తు చేశారు. తాను చదువుకుంటున్న రోజుల్లో హిందీకి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారడం కూడా చూశానని చెప్పారు. అప్పట్లో సెకండ్ లాంగ్వేజ్‌గా హిందీ లేదా సంస్కృతాన్ని ఎంపిక చేసుకున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వ స్కాలర్‌షిప్ లు ఇచ్చేవారు కాదన్నారు. హిందీ అంటే భయం ఉండిపోయిందన్నారు.