గవర్నర్ దత్తాత్రేయకు అవమానం
1 min read
పల్లెవెలుగువెబ్: చండీగఢ్‌లో నిర్వహించిన ఎయిర్ షో ప్రొటోకాల్ వివాదానికి దారితీసింది. శనివారం జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పంజాబ్ గవర్నర్, చండీగఢ్ పాలనాధికారి (అడ్మినిరేస్టటర్) బన్వారీ లాల్ పురోహిత్ రాష్ట్రపతి పక్క సీటులో కూర్చున్నారు. కానీ.. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయను మాత్రం రాష్ట్రపతికి రెండు సీట్ల దూరంలో కూర్చోబెట్టారు. దీనిపై హరియాణా ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ రాష్ట్ర గవర్నర్‌కు అవమానం జరిగిందని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. ప్రొటోకాల్ నిబంధనల ప్రకారం… రాష్ట్రపతి పాల్గొనే ఏ కార్యక్రమంలోనైనా అక్కడ ఉపరాష్ట్రపతి లేదా ప్రధానమంత్రి లేకపోతే.. రాష్ట్రపతి పక్కనే ఆ రాష్ట్ర గవర్నర్ కూర్చోవాలి. పంజాబ్, హరియాణా రాష్ట్రాలకు చండీగఢ్ ఉమ్మడి రాజధాని. రాష్ట్రపతి పక్కన హరియాణా గవర్నర్ కూర్చోవాల్సి ఉంది.