PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శాంకుతలమ్‌ షూటింగ్‌ స్టార్ట్‌..

1 min read

సినిమా డెస్క్​ : సమంత నటిస్తున్న ‘శాకుంతలమ్‌’ సినిమా షూటింగ్‌ స్టార్టయ్యింది. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో భారీ సెట్ వేసిన సంగతి తెలిసిందే. మహా భారతం ఆధారంగా తెరకెక్కిస్తున్న ‘శాకుంతలమ్’ సినిమాకి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఇదిలా ఉంటే సమంత గురించి మరో న్యూస్‌ వైరలవుతోంది. తను నాని ప్రొడక్షన్‌లో మరో ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీకి కమిట్ అయిన్నట్టు వినిపిస్తోంది. సమంత కోసం ఇప్పటికే స్ర్కిప్ట్ కూడా రెడీ అయ్యిందని సమాచారం. తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునే పవర్‌‌ఫుల్ పాత్రలో సమంత నటించనుందట. నాని కూడా గెస్ట్ రోల్‌లో కనిపిస్తాడట. టక్‌ జగదీశ్, శ్యామ్‌ సింగ్‌ రాయ్‌, అంటే సుందరానికి సినిమాలతో బిజీగా ఉన్న నాని, నిర్మాతగానూ పలు ప్రాజెక్టులు చేస్తున్నాడు. తాజాగా ‘మీట్ క్యూట్’ మూవీ అనౌన్స్ చేసిన నాని, తర్వాత సమంతతోనే చేయనున్నాడని టాక్ బలంగా వినిపిస్తోంది. దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.

About Author