విపక్షాలకు శరద్ పవార్ షాక్ ఇచ్చారు !
1 min read
పల్లెవెలుగువెబ్ : రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తున్న వేళ విపక్షాలకు కేంద్ర మాజీ మంత్రి, ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ షాక్ ఇచ్చారు. ప్రతిపక్షాల అభ్యర్థిగా రాష్ట్రపతి రేసుకు దూరంగా ఉండాలని శరద్ పవర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ‘నేను రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీచేయడం లేదు. రాష్ట్రపతి రేసులో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఉండబోను’ అని సోమవారం రాత్రి ముంబైలో జరిగిన ఎన్సీపీ సమావేశంలో శరద్ పవార్ తెలిపారు.