ఆస్తిలో వాటా.. కూతురికి దక్కుతుందా ?
1 min readపల్లెవెలుగువెబ్ : ఆస్తి పంపకం విషయంలో కర్ణాటక హైకోర్టు ఆసక్తికర తీర్పు వెలువరించింది. ఆస్తిలో కుమార్తె వాటా కోరితే వరకట్నం రూపంలో పొందిన దానిని కూడా కలుపుకోవాలని ఆదేశించింది. బెంగళూరుకు చెందిన ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి సూరజ్ గోవిందరాజ్ ఏకసభ్య ధర్మాసనం విచారించింది. వరకట్నంగా చెల్లించిన సొమ్ము, ఆస్తిని కూడా విభజన వేళ దావాలో చేర్చాలని ఆదేశించింది. అవిభక్త కుటుంబంలో కుమార్తె ఆస్తి కోరితే మాత్రమే ఇది వర్తించనుందని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పు సరైనదేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.