పడిలేచిన ‘ IRCTC’ షేరు.. సర్కార్ పై తీవ్ర విమర్శలు !
1 min readపల్లెవెలుగు వెబ్: ప్రభుత్వ నిర్ణయంతో ఐఆర్సీటీసీ షేరు భారీగా పతనమైంది. ఒక్కరోజే దాదాపు 20 శాతానికి పైగా పతనమైంది. ఐఆర్సిటీసీ సంపాదించే కన్వీనియన్స్ ఫీజులో ప్రభుత్వానికి 50 శాతం వాటా ఇవ్వాలని ఐఆర్సిటీసీకి రైల్వే శాఖ లేఖ రాసింది. దీంతో ఆందోళనకు గురైన ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారు. షేరు ధర భారీగా కరెక్షన్ కు గురైంది. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించింది. దీంతో ఐఆర్సీటీసీ షేర్లు 39 శాతం దాక ఎగబాకాయి. ఈ సంస్థలో ప్రభుత్వానికి వాటాలున్నాయి. ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరైంది కాదని వ్యాపార వర్గాలు అభిప్రాయపడ్డాయి. కంపెనీకి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని ఇన్వెస్టర్లు అభిప్రాయపడ్డారు.