NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఇడుపుల‌పాయ‌లో ష‌ర్మిల‌.. నేడు పార్టీ ప్రక‌ట‌న‌

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఏపీ సీఎం జ‌గ‌న్ సోద‌రి వైఎస్ ష‌ర్మిల ఇడుపులపాయ చేరుకున్నారు. అక్కడ వైఎస్ స‌మాధి వ‌ద్ద ప్రార్థన‌లు నిర్వహించారు. ఈ ప్రార్థన‌ల్లో ష‌ర్మిల‌తో పాటు వైఎస్ విజ‌య‌మ్మ, ఇత‌ర కుటుంబ స‌భ్యులు పాల్గొన్నారు. ప్రార్థన‌ల అనంత‌రం ప్రత్యేక విమానంలో ఆమె హైద‌రాబాద్ చేరుకుంటారు. హైద‌రాబాద్ లోని రాయ‌దుర్గం జేఆర్సీ క‌న్వెన్షన్ సెంట‌ర్ చేరుకుంటారు. జేఆర్సీ క‌న్వెన్షన్ సెంట‌ర్లో తెలంగాణ అమ‌ర‌వీరులు, వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి విగ్రహాల‌కు నివాళి అర్పిస్తారు. అనంత‌రం వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి తెలంగాణ పార్టీ ప్రక‌టిస్తారు. అనంత‌రం జెండా ఆవిష్కరిస్తారు. పార్టీ ఎజెండా, స్థాప‌న ల‌క్ష్యం, విధివిధానాల‌పై ఆమె ప్రసంగిస్తారు.

About Author