వైయస్ షర్మిలమ్మ సభను విజయవంతం చేయండి
1 min readరాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలి
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలమ్మ కర్నూలు జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలి పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మస్తాన్ వలి మాట్లాడుతూ ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రజలతో మమేకమై మాట్లాడడానికి ఈ కార్యక్రమమునకు వైయస్ షర్మిలమ్మ వస్తున్నారని 29వ తేదీ సోమవారం సాయంకాలం 3 గంటలకు సభ మొదలవుతుందని సభ ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ వైఫల్యాలను ఎండ గట్టడమేనని, వైయస్సార్ అంటే, వై అంటే వై వి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డిని పార్టీ వారి ముగ్గురు చేతుల్లోనే నడుస్తుందని విమర్శించారు. కర్నూలు జిల్లాలో ఫిబ్రవరి నెలలో కాంగ్రెస్ పార్టీ లోనికి పెద్ద ఎత్తున వలసలు రాబోతున్నాయని కాంగ్రెస్ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను జగన్ ప్రభుత్వం ఏవిధంగా తుంగలో తొక్కిందో వివరిస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ షర్మిలమ్మ అడిగే ప్రశ్నలకు జగన్ మోహన్ రెడ్డి మరియు వారి ప్రభుత్వంలోని మంత్రులు ఎమ్మెల్యేలు ప్రభుత్వ సలహాదారులు సమాధానం చెప్పలేక ప్రభుత్వానికి సలహాలు ఇవ్వమంటే అది మానేసి షర్మిలమ్మ మీద అర్హత లేని వారు కూడా విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని జబర్దస్త్ నటి పుట్టినిల్లు తిరుపతి అయితే మెట్టినిల్లు చెన్నై అని ఆవిడేమో ఏపీలో రాజకీయాలు చేయవచ్చు కానీ కడప గడ్డమీద పుట్టిన వైఎస్ షర్మిలమ్మని విమర్శించడం ఎంతవరకు సమంజసం అని టిడిపిలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ ను కాంగ్రెస్ లో ఉన్నప్పుడు విజయమ్మను, జగన్మోహన్ రెడ్డిని విమర్శించిన వారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రులుగా చలామణి అవుతున్నారని, షర్మిలమ్మ ఈ గడ్డమీద పుట్టిన బిడ్డ అని ఎక్కడైనా తిరిగే హక్కు ఆమెకు ఉందని మస్తాన్ వలి వివరించారు. అలాగే ఉమ్మడి కర్నూలు జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశమునకు నంద్యాల కర్నూలు రెండు జిల్లాల కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సమావేశమును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కే బాబురావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షురాలుగా నియమితులైన శ్రీమతి వైయస్ షర్మిలమ్మ మొదటిసారిగా కర్నూలు జిల్లాకు విచ్చేయుచున్న సందర్భంగా ఆమెకు కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున ఘనస్వాగతం పలుకుదామని కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమంలో విజయవంతం చేయాలనిఈ కార్యక్రమం ముందుగా నంద్యాల చెక్ పోస్ట్ నుండి సి క్యాంపు కలెక్టరేట్ రాజవిహార్, ఆనంద్ టాకీస్, ఇందిరా గాంధీ నగర్, సీతారాం నగర్, వెంకటరమణ కాలనీ మీదుగా తనీష్ ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ ఉంటుందని అనంతరం తనిష్క్ ఫంక్షన్ హాల్ నందు ఉమ్మడి కర్నూలు జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశము జరుగునని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పిసిసి ఉపాధ్యక్షులు ఎం సుధాకర్ బాబు పీసీసీ ప్రధాన కార్యదర్శి దామోదరం రాధాకృష్ణ డిసిసి ఉపాధ్యక్షులు బి బతుకన్న రియాజుద్దీన్ డిసిసి ప్రధాన కార్యదర్శులు షేక్ నవీద్ సత్యనారాయణ గుప్త ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఈ లాజరస్ మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఎస్ ప్రమీల రాష్ట్ర మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు కొత్తపేట మున్న, సిటీ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ ఖాజా హుస్సేన్ డిసిసి కార్యదర్శి ఎజాజ్ అహ్మద్, జిల్లా మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఖాద్రి పాషా కాంగ్రెస్ నాయకులు ఉండవెల్లి వెంకటన్న బి సుబ్రహ్మణ్యం వెంకట రాముడు మొదలగు వారు పాల్గొన్నారు.