PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ష‌ర్మిల పార్టీ ఏర్పాటు.. భ‌ర్త అనిల్ ఏమ‌న్నారంటే ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీ సీఎం జ‌గ‌న్ సోద‌రి వైఎస్ ష‌ర్మిల తెలంగాణ‌లో పార్టీ ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. అయితే.. ఏపీలో కూడ వైఎస్ ష‌ర్మిల పార్టీ ఏర్పాటు చేస్తార‌న్న ఊహాగానాలు వెలువ‌డుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ష‌ర్మిల పార్టీ ఏర్పాటు పై ఆమె భ‌ర్త బ్ర‌ద‌ర్ అనిల్ కుమార్ స్పందించారు. సోమవారం గన్నవరం ఎయిర్ పోర్టుకు బ్రదర్ అనిల్ చేరుకోగా.. ఆయనను మీడియా ఏపీలో షర్మిల పార్టీ ఏర్పాటుపై ప్రశ్నించింది. తాను విజయవాడలో చిన్న ఫంక్షన్ ఉండి వచ్చానని.. తనకు ఇక్కడ ఏమి పని లేదన్నారు. షర్మిల ఏపీలో పార్టీ పెడుతున్నారా? అని మీడియా ప్రశ్నించగా.. ‘పార్టీకి, నాకు సంబంధం లేదు. నేను పార్టీ గురించి మాట్లాడను’ అని బ్రదర్ అనిల్ సమాధానమిచ్చారు.

                                        

About Author