NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మ‌హిళా ఎంపీల‌పై శ‌శిథ‌రూర్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు !

1 min read

పల్లెవెలుగు వెబ్​: సీనియ‌ర్ ఎంపీ శ‌శిథ‌రూర్ మ‌హిళా ఎంపీల‌పై చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దం అవుతున్నాయి. పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాల సంద‌ర్భంగా లోక్ స‌భ ప్రాంగ‌ణానికి వ‌చ్చిన శ‌శిథ‌రూర్ తో మ‌హిళా ఎంపీలు సెల్ఫీ తీసుకున్నారు. ఈ ఫోటోను శ‌శిథ‌రూర్ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. “ మ‌హిళా ఎంపీలు ఉండగా.. లోక్ స‌భ ఆక‌ర్ష‌ణీయ ప‌ని ప్ర‌దేశం కాద‌ని ఎవ‌ర‌న్నారు “ అంటూ ట్విట్ట‌ర్ లో  పోస్ట్ చేశారు. దీనిపై ప‌లువురి నుంచి విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. మ‌హిళ‌ల‌ను ఆక‌ర్ష‌ణీయ‌మైన వ‌స్తవుతో పోల్చ‌డం స‌రైంది కాద‌ని, తోటి ఎంపీల‌ను ఇలా మాట్లాడటం స‌రికాద‌ని ట్విట్ట‌ర్ విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. శ‌శిథ‌రూర్ వ్యాఖ్య‌ల ప‌ట్ల జాతీయ మ‌హిళా క‌మీష‌న్ కూడ అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. మ‌హిళా ఎంపీల‌ను ఆక‌ర్ష‌ణీయ‌మైన వ‌స్తువుగా పేర్కొంటూ కించ‌ప‌ర‌చ‌రాద‌ని పేర్కొంది.

About Author