కలెక్టర్ చేతులమీదుగా ‘‘షీ బాక్స్”ప్రారంభం..
1 min read
కర్నూలు , న్యూస్ నేడు: అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల సందర్భంగా ఏపీజేఏసి అమరావతి పిలుపు మేరకు ఉదయం 11.00 గంటలకు కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోజిల్లా కలెక్టర్, శ్రీ.రంజిత్ బాషా చే ” షీ బాక్స్” ప్రారంభించబడింది .లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న మహిళా ఉద్యోగులు మరియు బహిరంగంగా చెప్పలేని వేధింపులు సమస్యలను ఎదుర్కొంటున్న మహిళా ఉద్యోగులు వారి దరఖాస్తును షీ బాక్స్ లో వేయవచ్చు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా , శ్రీమతి నవ్య జాయింట్ కలెక్టర్, శ్రీమతి వెంకటనారాయణమ్మ , జిల్లా రెవెన్యూ అధికారిణి, శ్రీమతి సింధు సుబ్రమణియన్, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, నిర్వాహకురాలు, ఏపీజేఏసి అమరావతి జిల్లా అధ్యక్షులు శ్రీ.కె.వై.కృష్ణ మరియు మహిళా విభాగం ఛైర్‌పర్సన్ మరియు శ్రీమతి.సహెరా బాను, శ్రీమతి శివ పార్వతి, ఏపీఆర్ఎస్ఏ ఉపాధ్యక్షులు , ఏపీజేఏసి అమరావతి సహఅధ్యక్షులు, శ్రీమతి పద్మావతి, జీఎస్ ఏపీజేఏసి అమరావతి మహిళా విభాగం, మహిళలు ప్రతినిధులు మరియు అన్ని ప్రభుత్వ శాఖ మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు .