ఆమె నా భార్యే !
1 min readపల్లెవెలుగువెబ్ : నటి పవిత్ర, తెలుగు సీనియర్ నటుడు నరేష్‌లు పెళ్లి చేసుకోబోతున్నారని గత కొద్దిరోజులుగా జోరుగా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో కన్నడ నటుడు సుచేంద్రప్రసాద్ స్పందించారు. ‘నటి పవిత్రా లోకేశ్ నా భార్యే. హిందూ సంప్రదాయం ప్రకారం ఆమెను వివాహం చేసుకున్నాను. నా పాస్‌పోర్ట్, ఆధార్ కార్డును గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది’ అని కన్నడ నటుడు సుచేంద్రప్రసాద్ చెప్పారు. పవిత్రా లోకేశ్, తాను భార్యాభర్తలుగా అనేక కార్యక్రమాలకు వెళ్లామని, కానీ వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ తీసుకోలేదని చెప్పారు. మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకోవడం విదేశీ సంస్కృతికి నిదర్శనమని భావించామని, అందుకే సర్టిఫికెట్ తీసుకోలేదని చెప్పారు.