బద్వేల్ ఉప ఎన్నికల పరిశీలకులుగా షీల్ ఆసిష్, పి.విజయన్
1 min read
పల్లెవెలుగువెబ్, కడప: బద్వేల్ ఉప ఎన్నికలు ఈనెల 30న జరగనున్న నేపథ్యంలో ఎన్నికల పరిశీలకులుగా నియమితులైన ఐఆర్ఎస్ అధికారి షీల్ ఆసిష్, ఐపీఎస్ అధికారి పి.విజయన్లు శనివారం కడప జిల్లాకు చేరుకున్నారు. అభ్యర్థుల ఎన్నికల వ్యయం పరిశీలకులుగా షీల్ ఆసిష్, భ్రదత పరిశీలకులుగా పి.విజయన్లు వ్యవహరిస్తారు. ఈమేరకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయరామరాజు వెల్లడించారు. కాగా బద్వేల్ ఉప ఎన్నికకు మొత్తం 35మంది నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో ప్రధానంగా వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ సుధా, కాంగ్రెస్ అభ్యర్థులుగా పి.ఎం.కమలమ్మ, జె.ప్రభాకర్, బీజేపీ అభ్యర్థులుగా సురేష్, శివకృష్ణ ఉన్నారు.