శిల్పా బ్యాంక్ అంటేనే డబ్బులు కట్టారు..
1 min read– పోలీసులకు వర్జినల్ బాండ్లాతో ఎం పని..?
– మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్, ఆత్మకూరు: వర్ధన్ సొసైటీ బ్యాంక్ బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉండి పోరాడుతామని శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని డిష్ వేణు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ వర్ధన్ బ్యాంకును శిల్పా తోపాటు శిల్పా అనుచరులు ఆత్మకూరు పట్టణంలో ప్రారంభించారన్నరు. శిల్పా బ్యాంక్ అంటే వర్ధన్ బ్యాంకు అని అనడం తో ప్రజలు కోట్ల రూపాయలు డిపాజిట్ చేశారని, ఎమ్మెల్యే ఆ బ్యాంకుతో మాకు సంబంధం లేదనడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. అనుచరుడి కి బ్యాంకుతో సంబంధం లేకుంటే పార్టీ నుండి ఎందుకు సస్పెండ్ చేశారని, అనుచరులను సస్పెండ్ చేసినంత మాత్రాన బాధితులకు న్యాయం జరగదన్నారు. ప్రజలు కట్టిన డబ్బులు మొత్తం ఇచ్చేవరకు ఎమ్మెల్యే శిల్పా నే బాధ్యత తీసుకొని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు జాషువా అలియాస్ మహేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి కేసును మూసేయాలని చూస్తున్నారని, జాషువా అనే వ్యక్తి ఎవరో జిల్లాలోనే ఎవరికి తెలియదన్నారు. వర్ధన్ బ్యాంక్ డిపాజిట్ చేసిన సమయంలో వచ్చిన బాండ్లను పోలీసులు ఒరిజినల్ ఇవ్వాలని ఎందుకు అడుగుతున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బ్యాంకు ప్రారంభం రోజు కూడా రాని జాషువా బోర్డు తిప్పిన వెంటనే ప్రత్యక్షమవడం ఏమిటని ప్రశ్నించారు . పేద ప్రజల డబ్బులు దండుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి మహేష్ అనే వ్యక్తి ది బ్యాంక్ అని చెప్పి చేతులు దులుపుకోవడం సరికాదని అసహనం వ్యక్తం చేశారు. చక్రవర్తి గా చెప్పుకొనే శిల్పచక్రపాణి రెడ్డి వర్ధన్ బ్యాక్ బాధితులందరికీ తక్షణమే డబ్బులు చెల్లించి తర్వాత వారి వద్ద నుండి వసూలు చేసుకోవాలన్నారు. ఇది కేవలం మన జిల్లా మన నియోజవర్గం సమస్య కాదని రాష్ట్ర వ్యాప్తంగా మోసాలకు పాల్పడే వారని త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తామని బుడ్డా రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. వీరి వెంట టిడిపి పట్టణ అధ్యక్షుడు వేణు, మండలాధ్యక్షుడు శివప్రసాద్ రెడ్డి, అబ్దుల్లాపురం భాష, నాగూర్ ఖాన్, షాబుద్దీన్, కరివేన స్వామి తదితరులు పాల్గొన్నారు.