‘తౌక్డే’’కు కొట్టుకుపోయిన నౌకలు.. 410 మంది సిబ్బంది..!
1 min readపల్లెవెలుగు వెబ్: తౌక్టే తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. తుఫాన్ ధాటికి ముంబయిలోని సముద్రం అల్లకల్లోలంగా మారింది. ముంబయి హై ప్రాంతంలో తీరానికి నిలిపి ఉన్న రెండు బార్జ్ ల యాంకర్లు తొలగిపోయాయి. అవి అలల ధాటికి కొట్టుకుపోతున్నాయి. ఈ రెండు నౌకల్లో దాదాపు 410 మంది సిబ్బంది ఉన్నారు. వీరిని రక్షించేందుకు నేవీ సహాయక చర్యలు ప్రారంభించింది. రెస్క్యూ సేవల కోసం ఐఎన్ఎస్ కోచి రంగంలోకి దిగింది. మరో నౌక కోసం ఐఎన్ఎస్ కోల్ కతా రంగంలోకి దిగింది. తుఫాను ధాటికి యాకంర్లు తొలగిపోయాయని, కొట్టుకుపోయిన నౌకల్లోని సిబ్బందిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని నేవీ అధికారులు తెలిపారు.