PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మెల్యే ను విమర్శించే స్థాయి శివారెడ్డికి లేదు

1 min read

– ఇందిరెడ్డి శివారెడ్డి ఎలాంటి వాడో మండల ప్రజలందరికీ తెలుసు

– ఓటమి ఎరగని నాయకుడు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి

– ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కమలాపురం నియోజకవర్గ లో ఎగిరేది వైసీపీ జెండా నే

– వైఎస్ఆర్సిపి టౌన్ కన్వీనర్ ముదిరెడ్డి సుబ్బారెడ్డి

పల్లెవెలుగు వెబ్  చెన్నూరు : కమలాపురం శాసనసభ్యులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిని విమర్శించే స్థాయి తెలుగుదేశం నాయకుడు ఇంది రెడ్డి శివారెడ్డికి లేదని వైయస్ఆర్సీపీ టౌన్ కన్వీనర్ ముదిరెడ్డి సుబ్బారెడ్డి తెలిపారు, సోమవారం ఆయన చెన్నూరు లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, తెలుగుదేశం నాయకుడు ఇందిరెడ్డి శివారెడ్డి ఎమ్మెల్యే పై అవాక్కులు చవాకులు వాగడం విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు, ఇంది రెడ్డి శివారెడ్డి బాగోతం మండల ప్రజలందరికీ  తెలుసని ఆయన అన్నారు, 20 సంవత్సరాల కిందట, కడప ఎయిర్పోర్ట్ పరిధిలో ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రమణారెడ్డి కుమారుడు వద్ద ఎకరా 40 వేల రూపాయలు అని చెప్పి, 20 ఎకరాలకు 40 వేల రూపాయల చొప్పున అతని వద్ద భూమి కొనుగోలుకు డబ్బు లు తీసుకోవడం జరిగిందన్నారు, తర్వాత ఆ భూమిని ఎకరా 19 వేల రూపాయలతో కొనుగోలు చేసిన మాట వాస్తవం కాదా శివారెడ్డి అంటూ ప్రశ్నించారు, అంతేకాకుండా 4 సంవత్సరాల కిందట అదే భూమిని 12 లక్షల రూపాయలకు వేరే వాళ్లకు విక్రయించి 4 లక్షల రూపాయలకు విక్రయించినట్లు రమణారెడ్డి కుమారునికి చెప్పడం నిజం కాదా శివారెడ్డి అంటూ నిలదీశారు, 12 లక్షల రూపాయల చొప్పున 20 ఎకరాల  భూమిని నువ్వు అమ్ముకొని 4 లక్షల రూపాయలతో ఆయనకు నువ్వు డబ్బులు ఇవ్వడంతో ఆయన నిజా నిజాలు తెలుసుకుని, చెన్నూరు లోని వైయస్సార్సీపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్ వి ఎస్ ఆర్, నివాసంలో కమలాపురం కు చెందిన వాసుదేవ రెడ్డితో నువ్వు పంచాయతీ పెట్టిన మాట వాస్తవం కాదా శివారెడ్డి అంటూ ఆయన ప్రశ్నించారు, నమ్మించి మోసం చేయడంలో మీకు మీరే సాటి అని నిరూపించుకున్నారని ఆయన శివారెడ్డి తీరుపై మండిపడ్డారు, ఇంతటి నీచమైన చరిత్ర ఉన్న మీరు ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ని విమర్శించడం విడ్డూరమని ఆయన దుయ్యబట్టారు, కరోనా కష్టకాలంలో కూడా నియోజకవర్గంలోని ప్రతి గడపకు వెళ్లి ప్రజల యోగక్షేమలు తెలుసుకొని వారికి చేతనైనంత సహాయం చేసిన వ్యక్తి ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అని ఆయన అన్నారు, కరోనా కష్టకాలంలో తెలుగుదేశం నాయకులు ఎక్కడ కూడా వారి గడప దాటి బయటికి వచ్చిన దాఖలాలు లేవని ఆయన అన్నారు, గతంలో ఎవరికైనా పెన్షన్ కానీ, ఇంటి స్థలాలు కానీ, లోన్లు కానీ ఏవైనా సంక్షేమ పథకాలు ఇవ్వాలంటే టిడిపి వారికి సంబంధించిన వారికే జన్మభూమి కమిటీలు మంజూరు చేయడం జరిగిందని ఆయన అన్నారు, నేడు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కులాలు, మతాలు, పార్టీలు, వర్గాలు చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి నేరుగా వారి బ్యాంకు ఖాతాలలోనే జమ చేయడం జరుగుతుందన్నారు, అలాంటిది టిడిపి వారు వైసిపి ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటని ఆయన తెలిపారు, ప్రతినిత్యం ప్రజల కోసం పరితపించే వ్యక్తి ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అని, ఓటమి  ఎరుగని నాయకుడు ఎమ్మెల్యే అని ఆయన అన్నారు, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కమలాపురం నియోజకవర్గంలో ఎగిరేది వైసీపీ జెండా నే అని, గెలిచేది ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అని ఆయన అన్నారు, స్వయాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ వచ్చి ఇక్కడ పోటీ చేసిన వైసీపీ తప్ప, వేరే పార్టీ గెలిచే ప్రసక్తే లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు, త్వరలోనే చెన్నూరులో వైఎస్ఆర్సిపి నాయకులు టిడిపిలో చేరతారని నరసింహారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందుతారని శివారెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు, వైసిపి వాళ్లు వచ్చే తప్ప టిడిపి గెలవలేని స్థితిలో ఉందంటే ఆ పార్టీ ఉనికి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని ఆయన తెలిపారు, ఇంది రెడ్డి శివారెడ్డి గురించి చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉందని , నేను మాట్లాడిన మాటల్లో ఎంత మేరా నిజం ఉందో అనేది ప్రజలకు టిడిపి వాళ్లకు తెలుసని ఆయన అన్నారు, ఇంది రెడ్డి శివారెడ్డి మాట్లాడే ముందు చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని అలా కాకుండా ఎలా పడితే అలా మాట్లాడడం సబబు కాదని ఆయన అన్నారు, ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్ వి ఎస్ ఆర్,  సర్పంచ్ తుంగ చంద్రశేఖర్ యాదవ్, మండల కో ఆప్షన్ నెంబర్ వారిష్, వైఎస్ఆర్సిపి బిసి నాయకులు రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

About Author