PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భక్తులతో పోటెత్తిన శివాలయాలు…

1 min read

శివనామ స్మరణతో మారుమోగిన శివాలయాలు 

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: మహాశివరాత్రి పర్వదినం కావడంతో శుక్రవారం చెన్నూరు మండలంలోని వివిధ ప్రాంతాల్లో నెలకొన్న శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. మండలంలోని బలిసింగాయపల్లి గ్రామ పరిధిలో కైలాసగిరి కోనలో వెలసిన సిద్ధ లింగేశ్వర స్వామి ఆలయంలో ఉదయం ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. ఉదయం 9 గంటలకు కమలాపురం శాసనసభ్యుడు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి తనయుడు సీకే దిన్నె జడ్పిటిసి పోచం రెడ్డి నరేన్ రామాంజనేయులు రెడ్డి ఆలయంలో పూజలు నిర్వహించి అనంతరం జాతీయస్థాయిలో ఒంగోలు జాతి ఎడ్లతో బండలాగుడు పోటీలను నరేన్ రామాంజనేయులు రెడ్డి ప్రారంభించి ఎడ్ల బండలాగుడు బహుమతులుగా ఆయన 55 వేల రూపాయలు ఇవ్వడం జరిగింది, కాగా వివిధ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున భక్తులు కైలాసగిరి సిద్ధ లింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు, భక్తులకు జిల్లా వైయస్సార్సీపి ఉపాధ్యక్షులు గుమ్మ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి మహిళ నాయకురాలు దాదిరెడ్డి భాగ్యమ్మ, వైయస్సార్ సిపి నాయకులు ఏర్పాట్లను పర్యవేక్షించారు, చెన్నూరు పెన్నా నది ఒడ్డున వెలసిన శ్రీ దాక్షాయిని సమేత మల్లేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు, చెన్నూరు పాత బస్టాండ్ సమీపంలో ఉన్న నాగేశ్వర స్వామి ఆలయంలో ఆలయ నిర్వహకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు, చెన్నూరు మండలం శివాలపల్లి గ్రామ పరిధిలో ఉన్న కాశీ విశ్వేశ్వరాలయంలో ఉదయం నుంచి భక్తులు వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు, ఆలయ కమిటీ నిర్వాహకులు ప్రత్యేక క్యూ లైన్ లో ఏర్పాటు చేసి తీర్థ ప్రసాదాలు భక్తులకు అందజేశారు, ఉప్పరపల్లి గ్రామ పరిధిలో ఉన్న మల్లేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. రామనపల్లి గ్రామంలో నెలకొన్న శ్రీ గౌరీ మల్లేశ్వర ఆలయంలో తెల్లవారుజాము నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. టిటిడి బోర్డు మెంబర్ మాసిమా బాబు ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు, అనంతరం వెంకటేశ్వర్లు శర్మ ఆధ్వర్యంలో వేదమంత్ర ఉచ్ఛరణతో స్వామి అమ్మవార్ల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. మధ్యాహ్నం అన్న ప్రసాద వితరణ నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినం కావడంతో ఆలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు, వివిధ ఆలయాల పరిధిలో భక్తులు జాగరణ చేసేందుకు సాంస్కృతిక కార్యక్రమాలు భజనలు, కీర్తనలు ఆలయ కమిటీ నిర్వాహకులు ఏర్పాటు చేశారు, ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రఘురామిరెడ్డి, వైఎస్ఆర్ సీపీ యువ నాయకులు శ్రీకాంత్ రెడ్డి, గుమ్మల్ల సాయి కుమార్ రెడ్డి, సత్య రాజు, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ ,వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ జిఎన్ భాస్కర్ రెడ్డి, ముదిరెడ్డి సుబ్బారెడ్డి, మోహన్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి, కాల్వ కొండ రెడ్డి, దేవగుడి భాస్కర్ రెడ్డి, డిఎంఆర్, వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About Author