NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏషియన్ గేమ్స్ సేపక్ తక్ర కు శివకుమార్ ఎంపిక

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ఏషియన్ గేమ్స్ సెపక్తక్రా పోటీలకు మన జిల్లాకు చెందిన శివకుమార్ భారత జట్టుకు ఎంపిక రావడం జరిగింది ఈ జట్టు ఈనెల 23వ తేదీ నుండి అక్టోబర్ 8వ తేదీ వరకు చైనా దేశంలోని హంగ్ జో Hangzhou నగరంలో జరిగే 19వ ఏషియన్ గేమ్స్ సెపక్తక్రా ఛాంపియన్ షిప్ పోటీలలో పాల్గొనడం జరుగుతుందని రాష్ట్ర సేపక్ తక్రా సంఘం కార్యదర్శి జి శ్రీనివాసులు తెలిపారు భారత జట్టు లో మన జిల్లాకు చెందిన శివకుమార్ స్థానాన్ని సంపాదించుకోవడం మన రాష్ట్రానికే గర్వకారణమని అన్నారు కేవలం నాలుగు రాష్ట్రాల తో ఏర్పడిన ఈ జట్టులో మన ఆంధ్రప్రదేశ్ నుండి భారత జట్టుకు ఎంపిక కావడం విశేషం ఈ జట్టుకు 40 రోజులపాటు థాయిలాండ్ లో విదేశీ శిక్షకులచే శిక్షణ శిబిరాన్ని నిర్వహించడం జరిగింది అనంతరం మరో 30 రోజుల పాటు ఢిల్లీలో అఖిలభారతక్రా సంఘం శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసింది ఈ జట్టులో స్థానాన్ని కల్పించుకోవడానికి శివకుమార్ రెండు మార్లు ప్రపంచ ఛాంపియన్ షిప్ లోను అనేక జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్న అనుభవం కారణంగా స్థానాన్ని సంపాదించుకోవడం జరిగింది శివకుమార్ ఎంపిక పట్ల రాష్ట్ర సెపక్ తక్రా సంఘం ప్రతినిధులు, జిల్లా క్రీడా సంఘాల అధ్యక్ష కార్యదర్శులు తో పాటు క్రీడా అభిమానులు శివకుమార్ కు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు.

About Author