జ్ఞానవాపి మసీదులో శివలింగం !
1 min readపల్లెవెలుగువెబ్ : వారణాసిలోని కాశీ విశ్వనాథుని ఆలయం సమీపంలోని జ్ఞానవాపి మసీదు లోపల శివలింగం బయటపడిన ప్రాంతాన్ని సీల్ చేయాలని వారణాసి సివిల్ కోర్టు ఆదేశించింది. జ్ఞానవాపి మసీదు కాంపెక్స్‌లో చేపట్టిన వీడియోగ్రఫీ సర్వే సోమవారం పూర్తయింది. ఇక్కడున్న బావిలో శివలింగం బయటపడినట్టు హిందూ అడ్వకేట్లు ప్రకటించారు. శివలింగానికి రక్షణ కల్పించాలంటూ న్యాయవాది విష్ణు జైన్ నేరుగా సివిల్ కోర్టును ఆశ్రయించారు. దీంతో జిల్లా మేజిస్ట్రేట్‌కు కోర్టు తక్షణ ఆదేశాలు జారీ చేసింది. శివలింగం లభించిన ప్రాంతాన్ని వెంటనే సీల్ చేయాలని, విజిటర్ల ప్రవేశాన్ని నిషేధించాలని కోర్టు ఆదేశించింది. సీల్ చేసిన ప్రాంతానికి భద్రత కల్పించాలని వారణాసి డీఎం, పోలీస్ కమిషనర్, సీఆర్‌పీఎఫ్ కమాండంట్‌లకు ఆదేశాలిచ్చింది.