PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీశైలంలో నేటి నుంచి శివరాత్రి బ్రహ్మోత్సవాలు

1 min read

పల్లెవెలుగు వెబ శ్రీశైలం: శివరాత్రి వస్తుందంటే చాలు శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగిపోతుంటాయి.. శివరాత్రికి ముందే ప్రముఖ శైవక్షేత్రాల్లో బ్రహ్మోత్సవాలు సంబరాలు మొదలవుతుంటాయి.. ఇక, ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది.. ప్రతీ ఏడాది శివరాత్రి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.. శివరాత్రిని పురస్కరించుకుని ఈ ఏడాది కూడా బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేశారు.. శ్రీశైలంలో నేటి 1 నుండి ఈనెల 11వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.. ఇవాళ ఉదయం 9 గంటలకు శ్రీస్వామివారి యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలకు  ఆలయ అర్చకులు.. శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు వేద పండితులు
ఈవో పెద్దిరాజు చైర్మన్ చక్రపాణి రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు

శ్రీకాళహస్తి ఆలయం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు

శ్రీశైలంబ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి అమ్మవారికి పట్టువస్త్రాలు శ్రీకాళహస్తి దేవస్థానం ఈవో నాగేశ్వరరావు ఆలయ అర్చకులు శాస్రోక్తంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. సాయంత్రం బ్రహ్మోత్సవాలకు సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణ, ధ్వజపటం ఆవిష్కరణ ఆలయ అర్చకులు చేయనున్నారు.బ్రహ్మోత్సవాల సమయంలో 11 రోజులపాటు స్వామి అమ్మవార్లకు వివిధ సేవలు నిర్వహిస్తారు. మహా శివరాత్రి రోజున సాయంత్రం స్వామి అమ్మవార్లకు ప్రభోత్సవం, రాత్రి లింగోద్భవ సమయంలో మహాన్యాస పూర్వక మహా రుద్రాభిషేకం నిర్వహిస్తారు. ఇదే సమయంలో స్వామివారికి పాగాలంకరణ కార్యక్రమం ఉంటుంది. లింగోద్భవ కార్యక్రమం అనంతరం స్వామి అమ్మవార్లకు కల్యాణోత్సవం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా పలు వాహన సేవలు నిర్వహించనున్నారు. లింగోద్భవకాల మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, పాగాలంకరణ, స్వామి, అమ్మవార్ల బ్రహ్మోత్సవ కల్యాణం నిర్వహించనున్నారు.ఈ బ్రహ్మోత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలు భక్తులు తరలివస్తున్నారు.. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని శ్రీశైలం దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.. ఇటు ఏపీఎస్ఆర్టీసీ, అటు టీఎస్ఆర్టీసీ భక్తుల కోసం ప్రత్యేక బస్సులను నడుపుతున్నాయి.

About Author