శివరాత్రి వేడుకలు భరతమాత దేవాలయంలో వైభవంగా నిర్వహిస్తున్నాం
1 min read
అధ్యక్షులు సందడి మహేశ్వర్ పిలుపునిచ్చారు.
పల్లెవెలుగు కర్నూలు: సోమవారం కర్నూల్ రెవెన్యూ కాలనీలో గల భరతమాత దేవాలయంలో జరిగిన భరతమాత సేవాసమితి కార్యవర్గ సమావేశములో అధ్యక్షులు సందడి మహేశ్వర్ మాట్లాడుతూ శివరాత్రి వేడుకలు భరతమాత దేవాలయంలో వైభవంగా నిర్వహిస్తున్నామని తెల్లవారుజాము నుండి అభిషేకాలు, అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవము అనంతరం శివపార్వతుల కళ్యాణ మహోత్సవం లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకి పాత్రులు కాగలరని పిలుపునిచ్చారు.. భరతమాత దేవాలయంలో ప్రతినెల పౌర్ణమి నాడు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహిస్తున్నామని, సంకటహర చతుర్దశి నాడు విశేష పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. భరతమాత దేవాలయంలో వెలసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దాదాపు 3 దశాబ్దాలుగా ధనుర్మాస వ్రత మహోత్సవాలు వేలాది మంది భక్తుల సమక్షంలో సాంప్రదాయ బద్దంగా వైభవంగా జరిపామని, దసరా నవరాత్రి మహోత్సవాలు, వినాయక ఉత్సవాలు, శ్రీరామనవమి మహోత్సవాలు ఘనంగా నిర్వహించామని తెలిపారు. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో భరతమాత సేవా సమితి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సంకల్పించామని తెలియజేశారు. ఈ కార్యవర్గ సమావేశంలో భరతమాత సేవా సమితి కార్యదర్శి అయోధ్య శ్రీనివాస్ రెడ్డి, కోశాధ్యక్షులు మల్లెల పెద్ద పుల్లారెడ్డి, సహ కార్యదర్శిలు టీ.ప్రతాపరెడ్డి, చంద్రారెడ్డి, సభ్యులు లావణ్య, నారాయణరెడ్డి, భరద్వాజ్ శర్మ, దేవాలయ సేవకులు వడ్డే రాము, అరుణ్ లు పాల్గొన్నారు.