NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సినీ నటుడు శోభన్ బాబు జన్మదిన వేడుకలు

1 min read

ముఖ్యఅతిథిగా పాల్గొన్న కర్నూల్ ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: సినీ నటుడు శోభన్ బాబు సేవ సమితి ఆధ్వర్యంలో సినీ నటుడు శోభన్ బాబు 88వ జన్మదిన వేడుకలను కర్నూలు నగరం లో ఘనంగా నిర్వహించారు. కర్నూలు నగరంలోని గాంధీ నగర్ వద్ద ఏర్పాటు చేసిన శోభన్ బాబు విగ్రహానికి కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ ,సుధాకర్ ,రైల్వే ప్రసాద్  పూలమాలవేసి నివాళులర్పించారు.ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్  మాట్లాడుతూ సినీనటుడు శోభన్ బాబు చేసిన సినిమాలు అనేక మందికి ఆకట్టుకున్నాయని, ఆయన చేసిన సినిమాలతో కొందరు అభిమానులు అయ్యారని తెలిపారు. సమాజానికి ఉపయోగపడే కుటుంబ కథా చిత్రాల్లో ఆయన నటించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ ,  ద్రోరా బాబు,రైల్వే ప్రసాద్ , యోహాన్ , శ్రీను  రసూల్ , చిన్న రాముడు ,శోభన్ బాబు సేవా సమితి సభ్యులు,అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కేక్ కట్ చేయడం జరిగింది.

About Author