తిమ్మనాయుని పేట గ్రామంలో టిడిపి పార్టీకి షాక్
1 min read– టిడిపి పార్టీని వీడి వైయస్సార్ పార్టీలోకి చేరిన 63 ముస్లిం మైనారిటీ కుటుంబాలు
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : నియోజకవర్గం లో కొలిమిగుండ్ల మండలం తిమ్మనాయుని పేట గ్రామంలో టిడిపి పార్టీకి చెందిన 63 ముస్లిం మైనార్టీ కుటుంబాలు బనగానపల్లె నియోజకవర్గం శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారి ఆధ్వర్యంలో టిడిపి పార్టీని వీడి వైయస్సార్ పార్టీలో చేరారు. టిడిపి పార్టీకి చెందిన బడాబాషా, చికెన్ హుస్సేన్ సా, గాజుల నన్నేవలి, కొట్టం గుర్రప్ప, దూదేకుల దస్తగిరి, దూదేకుల బాబు, ఉల్లి నాగేంద్రప్రసాద్, షేక్ మొహమ్మద్ భాష, హరిబాబు శెట్టి, అవుకు బాలుడు నాగ పుల్లయ్య, గంధం నారాయణ స్వామి, గంధం చిన్న వెంకటస్వామి, మెకానిక్ శివ, బికారి సాహెబ్ ,దూదేకుల హాజీవలి, దూదేకుల గురు, ఎర్ర మదర్ సా లతోపాటు మొత్తం 63 కుటుంబాల సభ్యులకు బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు వైయస్సార్ పార్టీ కడువా కప్పి వైఎస్ఆర్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టి మూడున్నర సంవత్సరకాలం అయిందని ఈ ప్రభుత్వంలో పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా అర్హులైన ప్రతి పేదవానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతుండడంతో వాటికి ఆకర్షితులై బనగానపల్లె నియోజకవర్గం లో టిడిపి పార్టీని వీడి వైయస్సార్ పార్టీలో చేరడం జరుగుతుంది అని చెప్పారు. నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో స్థానిక నాయకుల మధ్య అవగాహన లోపంతో కొన్ని చిన్ని చిన్ని సమస్యలు ఉన్నాయి అని వాటిని తన దృష్టికి వస్తుండడం తో ఎప్పటికప్పుడు ఆ సమస్యలను పరిష్కరించి నాయకుల మధ్య వర్గ విభేదాలు లేకుండా చేయడం జరుగుతుంది అని చెప్పారు. అర్హులైన ప్రతి పేదవానికి జగనన్న సంక్షేమ పథకాలు అందాలనేదే తన ధ్యేయమని చెప్పారు. నిజమైన అర్హులకు సంక్షేమ ఫలాలు అందినప్పుడే ప్రజాప్రతినిధిగా తనకు ఎంతో సంతోషం కలుగుతుందని చెప్పారు. పేద ప్రజలకు ఎప్పుడైతే వారికి అర్హులైన సంక్షేమ ఫలాలు అందుతాయో అప్పుడు ఒక ప్రజాప్రతినిధిగా తాను కూడా నిర్భయంగా ఓటు అడగగలనని చెప్పారు. ఈ రోజున వైయస్సార్ పార్టీ తరఫున ఎన్నికైన ప్రజాప్రతినిధిగా నేను ఒకటే చెబుతున్నాను ప్రభుత్వ సంక్షేమ ఫలాలు మీకు అందుతున్నాయా, మా వైఎస్ఆర్ ప్రభుత్వం ద్వారా మీరు లబ్ధి పొందుతున్నారా అలా అయితేనే మాకు ఓటు వేయండి అని ధైర్యంగా ప్రజల మధ్యకు పోయి ధైర్యంగా చెప్పగలుగుతున్నామంటే దాని వెనుక మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కృషి సహకారాలు ఎంతో ఉందని చెప్పారు. వచ్చే 2024 సంవత్సరంలో బనగానపల్లె నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా తానే పోటీ చేస్తానని గ్రామాల్లో వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టి కృషితో తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. అర్హులైన పేదలకు అందరికీ పార్టీలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలంటే మళ్ళీ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి కావాలని అప్పుడే అర్హులైన ప్రతి పేదవానికి లబ్ధి చేకూరడం జరుగుతుందని కాబట్టి ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా వైయస్సార్ పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించి మళ్లీ రెండోసారి ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈరోజు తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద తనమీద ఎంతో నమ్మకంతో టిడిపి పార్టీని వీడి వైయస్సార్ పార్టీలో చేరడం జరుగుతుందని మీరందరికి తన పార్టీలో సముచిత స్థానాన్ని కల్పిస్తానని అలాగే ఆ కుటుంబాలకు తన సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తాను అని ఆ కుటుంబాలకు అండగా ఉంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో తిమ్మనాయుని పేట వైయస్సార్ పార్టీ నాయకులు చిన్న మదర్ సా, మహబూబ్ పీరా, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.