NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏపీ ఉద్యోగులకు షాక్ !

1 min read

పల్లెవెలుగువెబ్ : ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. హెచ్ఆర్ఏ విషయంలో సానుకూల నిర్ణయం వ్తస్తుందని ఆశించిన ఉద్యోగులకు నిరాశే ఎదురైంది. సోమవారం రాత్రి కొత్త సవరణ ఉత్తర్వులను వెలువరించింది. ఉద్యోగుల డిమాండ్ ను బేఖాతరు చేసింది. అశుతోష్​ మిశ్రా కమిటీ సిఫారసులు పరిగణనలోకి తీసుకోకుండా సీఎస్ కమీటి సూచనలనే పరిగణనలోకి తీసుకుంది. హెచ్ఆర్ఏ విషయంలో కోత విధించింది. గతంలో ఉద్యోగుల కార్యక్షేత్రం జనాభా ప్రాతిపదికన నాలుగు కేటగిరీల్లో హెచ్‌ఆర్‌ఏను నిర్ణయించారు. ఇప్పుడు ప్రభుత్వం వాటిని మూడుకు కుదించింది. ఒక శ్లాబును మాయం చేసింది. గుంటూరు, కృష్ణా జిల్లాల పరిధిలో ఏర్పాటైన రాష్ట్ర సచివాలయం, హెచ్‌వోడీ ఉద్యోగులకు గత ప్రభుత్వ హయాంలో సచివాలయం, హెచ్‌వోడీల ఉద్యోగులకు 30 శాతం హెచ్‌ఆర్‌ఏ లభించేది. విభజనకు ముందు హైదరాబాద్‌లో అమలైన హెచ్‌ఆర్‌ఏనే వీరికి కొనసాగించారు. ఇప్పుడు దీనిని 16శాతానికి కుదించారు. వీరందరికీ 14 శాతం కోత పడినట్లే. ఇక గుంటూరు, విశాఖ, నెల్లూరు, విజయవాడ నగరాల్లోని ప్రభుత్వ సిబ్బందికి గతంలో 20 శాతం హెచ్‌ఆర్‌ఏ వచ్చేది. దీనిని 16శాతానికి కుదించారు. సిటీ కాంపన్సేటరీ అలవెన్స్‌ (సీసీఏ)ను కూడా ప్రభుత్వం ఎత్తేసింది. గతంలో విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో పని చేసే సిబ్బందికి రూ.500.. సచివాలయం/హెచ్‌వోడీ సిబ్బందికి రూ.వెయ్యి సీసీఏ లభించేది. ఇప్పుడు ‘సీఎస్‌ కమిటీ’సిఫారసుల పేరుతో ఈ ప్రయోజనాన్ని కూడా ఎత్తివేసింది. రిటైర్డ్‌ ఉద్యోగులకు గ్రాట్యుటీని రూ.12లక్షల నుంచి రూ.16 లక్షలకు పెంచడం ఒక్కటే ప్రభుత్వం తీసుకున్న సానుకూల చర్యగా ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి.

           

About Author