బీజేపీకి షాక్.. 13 మంది ఎమ్మెల్యేల జంప్ ?!
1 min readపల్లెవెలుగువెబ్ : ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీకి గట్టి దెబ్బలు తగులుతున్నాయి. బీజేపీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య బీజేపీకి, మంత్రి పదవికి రాజీనామా చేసి.. సమాజ్ వాదీ పార్టీలో చేరారు. ఆ వెంటనే మరో ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీకి గుడ్ బై చెప్పారు. ఇదిలా ఉంటే.. ఎన్సీపి అధినేత శరద్ పవార్ మరో బాంబు పేల్చారు. బీజేపీ నుంచి 13 మంది ఎమ్మెల్యేలు ఎస్పీలో చేరుతున్నారంటూ వ్యాఖ్యానించారు. దీంతో యూపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. సమాజ్వాదీ పార్టీ, ఇతర చిన్నపార్టీలతో కలిసి ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు చెప్పిన శరద్ పవార్.. ఉత్తరప్రదేశ్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని పేర్కొన్నారు. తప్పకుండా యూపీలో మార్పును చూస్తామని శరద్ పవార్ ధీమా వ్యక్తం చేశారు.