NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాళ్ల దాడి ఘ‌ట‌న‌లో చంద్రబాబుకు షాక్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: తిరుప‌తి రాళ్లదాడి ఘ‌ట‌న‌కు సంబంధించిన ఆధారాలు లేవ‌ని డీఐజీ కాంతిరాణా టాటా అన్నారు. చంద్రబాబు మీద జ‌రిగిన రాళ్లదాడి పై విచార‌ణ జ‌రపాల‌ని టీడీపీ ఫిర్యాదు ఇచ్చింద‌ని, ఫిర్యాదులో ఉన్న అంశాలకు స్పష్టమైన ఆధారాలు క‌న‌ప‌డ‌లేద‌ని చెప్పారు. ఈ ఘ‌ట‌న మీద సీన్ రిక‌న్ స్ట్రక్షన్ చేశామ‌ని, సీసీటీవీ ఫుటేజ్ ప‌రిశీలించిన‌ట్టు ఆయ‌న తెలిపారు. ప్రత్యక్ష సాక్షుల‌ను, భ‌ద్రతా సిబ్బందిని ప్రశ్నించిన‌ట్టు చెప్పారు. ఆధారాలుంటే పోలీసుల‌కు ఇవ్వాల‌ని చంద్రబాబును కోరిన‌ట్టు కాంతిరాణా టాటా తెలిపారు. పోలీసుల మీద నిరాధార ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని, చంద్రబాబు ప‌ర్యట‌న‌కు పూర్తీ స్థాయి భ‌ద్రత క‌ల్పించామ‌ని తెలిపారు.

About Author