NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్న ప్ర‌భుత్వ డాక్ట‌ర్ల‌కు షాక్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులు నిర్వహించే వైద్యులు ప్రైవేట్‌గా ప్రాక్టీస్‌ చేయకుండా నిషేధం విధిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీనిపై నియమ నిబంధనలు రూపొందించాలని అధికారులను ఆదేశించింది. ‘నాడు–నేడు’ కింద పెద్ద ఎత్తున నిధులను వెచ్చించి కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునికీకరించడంతోపాటు మెరుగైన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో వైద్యులు, నర్సింగ్, పారామెడికల్‌ సిబ్బందిని నియమించింది. నాణ్యమైన మందులను అందుబాటులోకి తెచ్చింది. అయితే ప్రభుత్వ డాక్టర్లు సర్కారు ఆసుపత్రుల్లో కంటే ప్రైవేటుగా ప్రాక్టీస్‌ చేస్తున్న ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు అందిస్తున్నట్లు ప్రజలు భావిస్తుండటం ప్రభుత్వం దృష్టికి వచ్చింది.

                                       

About Author