NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆర్జీవికి షాక్.. ఆయ‌న సినిమా ప్ర‌ద‌ర్శించం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ‌కు చేదు అనుభ‌వం ఎదురైంది. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం డేంజ‌ర‌స్. ఈ సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఏప్రిల్ 8న దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లో రిలీజ్ అవ్వబోతుంది. ఈ నేపథ్యంలో తన మూవీని ప్రదర్శించేందుకు పీవీఆర్‌, ఐనాక్స్‌ థియేటర్లు అభ్యంతరం వ్యకం చేశాయి. డేంజరస్‌ చిత్రాన్ని తమ థియేటర్లో ప్రదర్శించబోమంటూ వర్మకు షాకిచ్చాయి. ఈ విషయాన్ని స్యయంగా ఆర్జీవీ సోషల్‌ మీడియా వేదిక వెల్లడించాడు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేస్తూ.. పీవీఆర్‌, ఐనాక్స్‌ డెంజరస్‌ సినిమాను ప్రదర్శించడానికి నిరాకరించినట్లు తెలిపాడు. ‘నా సినిమా డేంజరస్ లెస్బియన్ కథాంశం అని దాన్ని ప్రదర్శించడానికి నిరాకరించడం సుప్రీంకోర్టు తీర్పుని వ్యతిరేకించడమే. సెన్సార్ బోర్డు ఆమోదించిన తర్వాత కూడా వ్యతిరేకించడం ఎల్‌జీబీటీ(LGBT) కమ్యూనిటీకి వ్యతిరేకంగా ఉన్నట్టే. అంటే పీవీఆర్‌, ఐనాక్స్ యాజమాన్యాలు ఎల్‌జీబీటీని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఈ కమ్యూనిటీ మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ వారి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారని ఆశిస్తున్నా’ అంటూ వర్మ చెప్పారు.

                                

About Author