NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రభుత్వానికి షాక్.. జీవో నెంబ‌ర్ 2 సస్పెండ్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబ‌ర్ 2ను హైకోర్టు స‌స్పెండ్ చేసింది. స‌ర్పంచ్ లు, పంచాయ‌తీ కార్యద‌ర్శుల అధికారాల్లో కొన్నింటిని వీఆర్వోల‌కు బ‌దిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం గ‌త నెల జీవో నెంబ‌ర్ 2ను జారీ చేసింది. కేసు తదుప‌రి విచార‌ణ నాలుగు వారాలు వాయిదా వేసింది. గుంటూరు జిల్లా తోకవానిపాలెం స‌ర్పంచ్ కృష్ణమోహ‌న్ దాఖ‌లు చేసిన పిటిష‌న్ పై ఈ రోజు హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది. పంచాయ‌తీ కార్యద‌ర్శుల హ‌క్కులు కాల‌రాసే విధంగా ఏపీ ప్రభుత్వ నిర్ణయం ఉంద‌ని పిటిష‌న‌ర్ త‌ర‌పు న్యాయ‌వాది వాద‌న‌లు వినిపించారు. రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 73 స‌వ‌ర‌ణ‌కు, ఏపీ పంచాయ‌తీ రాజ్ చ‌ట్టానికి వ్యతిరేకంగా జీవో ఉంద‌ని న్యాయ‌వాది కోర్టుకు తెలిపారు.

About Author