టికెట్ లేకుండా రైళ్లలో ప్రయాణించేవారికి షాక్ !
1 min readపల్లెవెలుగువెబ్ : రైళ్లలో టికెట్ లేకుండా ప్రయాణిస్తే పట్టుకునే సందర్భాలు తక్కువగానే ఉంటాయి. ఇకపై టికెట్ తీయకుండా ప్రయాణించేవారి ఆటలు సాగవు. ఇంతకాలం టికెట్ కలెక్టర్ల చేతిలో కాగితాల చార్ట్ మాత్రమే ఉండేది. తదుపరి స్టేషన్లో ఎన్ని బెర్తులు బుక్ అయ్యాయి, ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి.. లాంటి వివరాలు రైలు కదిలితే తప్ప చేతికి అందేవి కాదు. దీంతో రిజర్వేషన్ ఉన్న వారెవరో, టికెట్ లేని వారెవరో, ఆర్ఏసీతో ప్రయాణిస్తున్నవారు ఎక్కడెక్కడున్నారో తెలుసుకోవటానికి సమయం పట్టేది. ఇప్పుడు టీసీలందరికి హ్యాండ్ హెల్డ్ టెర్మినల్స్ (హెచ్హెచ్టీ) యంత్రాలను అందిస్తున్నారు. ఇవి రైల్వే ప్రధాన సర్వర్తో అనుసంధానమై ఉం టాయి. దీంతో ఎక్కడ కొత్త టికెట్ బుక్ అయినా చిటికెలో టీసీలకు సమాచారం తెలుస్తుంది. దీంతో టికెట్ లేని ప్రయాణికులను గుర్తించటం సులువవుతుందని అధికారులు చెబుతున్నారు.