NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

యూట్యూబ్ కు షాక్.. ఎందుకంటే ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : యూట్యూబ్ కు యూజ‌ర్లు షాక్ ఇస్తున్నారు. యూట్యూబ్ లో కంటెంట్‌ క్రియేటర్లు..టిక్‌ టాక్‌ వైపు మొగ్గు చూపడంతో గూగుల్‌ పేటెంట్‌ కంపెనీ యూట్యూబ్‌కు వచ్చే ఆదాయం భారీగా తగ్గిపోయినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. భారత్‌ మినహాయిస్తే మిగిలిన దేశాల్లో అందుబాటులో ఉన్న మరో వీడియో ఫ్లాట్‌ ఫామ్‌ టిక్‌ టాక్‌ను వినియోగించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో ఇటీవల విడుదలైన క్యూ1 ఫలితాల్లో గూగుల్‌ పేరెంట్‌ కంపెనీ ఆల్ఫాబెట్‌ లాభాలు తగ్గినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. మేనేజర్ డాన్ మోర్గాన్ మాట్లాడుతూ, “యూట్యూబ్‌ ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటుంది. రాబోయే రోజుల్లో ఆశాజనమైన ఫలితాల్ని సాధింస్తుందని అంచనా వేశారు. అయితే యూట్యూబ్‌కు వచ్చే ఆదాయం పడిపోవడానికి ఉక్రెయిన్‌పై చేస్తున్న రష్యా దాడి పరోక్ష కారణమని గూగుల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రూత్ పోరాట్ అన్నారు.

                                 

About Author