NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

షూటింగ్‌ షురూ..

1 min read

సినిమా డెస్క్​ : వీలైనంత తర్వగా తన సినిమాలను పూర్తి చెయ్యాలనుకుంటున్నారు మెగాస్టార్‌‌ చిరంజీవి. కరోనా కారణంగా చిరంజీవి ప్రాజెక్ట్స్‌ ఆలస్యమవుతూ వచ్చాయి. ప్రస్తుతం ‘ఆచార్య’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. వీలైనంత త్వరగా దీన్ని కంప్లీట్ చేసి ‘లూసిఫర్’ రీమేక్‌ని సెట్స్‌కి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారు చిరు. అందుకు ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. కొద్ది రోజుల క్రితం మ్యూజిక సిట్టింగ్స్ స్టార్ట్ చేసిన టీమ్.. ఇప్పడు షూటింగ్‌ కోసం నిన్న సెట్స్ వేయడం మొదలెట్టింది. ‘ఆచార్య’ కోసం టెంపుల్ సిటీని సృష్టించిన ఆర్ట్ డైరెక్టర్‌‌ సురేష్‌ సెల్వరాజనే ఈ చిత్రానికి కూడా పని చేస్తున్నాడు. ‘కొత్త రోజు. కొత్త ప్రారంభం. నా కొత్త సినిమా కోసం పని మొదలుపెడుతున్నాను. మరొక అద్భుతాన్ని సృష్టించబోతున్నాను’ అంటూ సురేష్ ట్వీట్ చేశారు. మలయాళంలో మోహన్‌లాల్‌ నటించిన ఈ సినిమా భారీ విజయం సాధించింది. చిరంజీవి ఇమేజ్‌కి తగ్గట్టుగా స్క్రిప్ట్‌ని మార్చినట్లు దర్శకుడు మోహన్‌రాజా చెప్పారు. మూవీ తర్వాత మెహర్‌‌ రమేష్‌ డైరెక్షన్‌లో ‘వేదాళం’ రీమేక్‌తో పాటు బాబి డైరెక్షన్‌లోనూ నటించనున్నారు చిరు.

About Author