దుకాణ దారులను ఆదుకోవాలి.. బుడ్డా
1 min readపల్లెవెలుగు వెబ్ శ్రీశైలం: శ్రీశైలంలో లలితాంబిక షాపింగ్ కాంప్లెక్స్ ఎల్ బ్లాక్ నందు 14 షాపులు నిన్న రాత్రి షార్ట్ సర్క్యూట్ అయి కాలిపోవడం చాలా బాధాకరమైన విషయం. ప్రకటన విడుదల చేశాడు అయితే గతంలో వ్యాపారస్తుల కోసం నేను ఎంతగానో శ్రమించి వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఉద్దేశంతో లలితాంబిక షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడం జరిగింది. అయితే ఇప్పుడు ఉన్న ప్రభుత్వము, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మార్కెట్ షాపులను తరలించే ప్రక్రియ సరిగా చేయలేదు. దుకాణాల తరలింపు చేసేటప్పుడు కూడా వ్యాపారులకు అన్ని సౌకర్యాలతో పాటు ముఖ్యంగా భద్రత కూడా వేసిన తర్వాతనే తరలించాలని చెప్పాను. కానీ దేవస్థానం అధికారులు, ఎమ్మెల్యే ఎటువంటి ఏర్పాట్లు చేయకుండా వారిని బదిలీ చేశారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వం, దేవస్థానం అధికారుల నిర్లక్ష్యంగా కనిపిస్తుంది. కాబట్టి ప్రధానంగా ఈ ప్రభుత్వం ఈ దేవస్థానం అధికారులు చొరవ తీసుకొని ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిందో ఆ 14 షాపులకు నష్టపరిహారం కట్టిస్తూ, రెండు సంవత్సరాల బకాయిలను చెల్లించకుండా వారిని ఆదుకోవాలని ప్రధానంగా బుడ్డా రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశాడు.