వెలవెలబోతున్న షాపింగ్ కాంప్లెక్స్ లు, అయోమయంలో వ్యాపారస్తులు
1 min readపల్లెవెలుగు వెబ్ ఏలూరు : 26వ డివిజన్ శనివారం పేట ప్రాంతంలో గత సంవత్సరం ఏప్రిల్ నెలలో నూతన డ్రైనేజీ కట్టడం కోసం రోడ్డు వెంబడి పాత డ్రైనేజీరి తొవ్వారు. ఏడాది కావవస్తున్న ఇప్పటికీ అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు గాని కన్నెత్తైనా చూడలేదు అంటున్నారు వ్యాపారస్తులు. షాపుల హద్దులు కట్టుకోలేక కరెంట్ బిల్లు కట్టుకోలేక వ్యాపారాలు లేక నష్టపోతున్నామని నెల, నెల అద్దులు చెల్లించటానికి అప్పు చేసిన వారి దగ్గర వడ్డీలు చెల్లించవలసి వస్తుందని బ్యాంకు లోన్లు కూడా కట్టుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి డ్రైనేజీలు పూర్తిచేసి మార్గాన్ని వేస్తే గాని వ్యాపారాలు కొనసాగిస్తామని తెలిపారు. డ్రైనేజీ తవ్వటం వలన డ్రైనేజీ లో నీరు బయటకు వచ్చి దుర్గంధం వెదజల్లుతోందని. తద్వారా ఈ శీతాకాలం సీజన్లో డింగి , మలేరియా అంటూ అంటువ్యాధులు ప్రభలవచ్చని ఆందోళన చెందుతున్నారు. దోమల బెడద వలన షాపులో ఒక గంట అయినా కూర్చోలేక పోతున్నామని అంటున్నారు.ఈ ప్రాంతంలో ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. ఎక్కువమంది పిల్లలు పెద్దలతో జనాభా రాకపోకలు కొనసాగిస్తుంటారు. డ్రైనేజీ నిర్మాణం త్వరగా పూర్తిచేసి వ్యాపారాలు కొనసాగించడానికి అవకాశం కల్పించుటున్నారు వ్యాపారస్తులు.