NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పార్టీలో చేరిన కొద్దిసేప‌టికే.. 10 ల‌క్షల ఫైన్ !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : హుజురాబాద్ కాంగ్రెస్ నేత పాడి కౌశిక్ రెడ్డి కేసీఆర్ స‌మ‌క్షంలో టీఆర్ఎస్ లో చేరారు. పార్టీలో చేరిన కొద్ది సేప‌టికే జీహెచ్ఎంసీ అధికారులు 10ల‌క్షల ఫైన్ తో షాక్ ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీలో చేరిక సంద‌ర్భంగా పాడి కౌశిక్ రెడ్డి జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ రోడ్లలో భారీగా క‌టౌట్లు ఏర్పాటు చేశారు. ఈ విష‌యాన్ని ట్విట్టర్లో కాంగ్రెస్ నేత‌లు షేర్ చేశారు. అనుమ‌తి లేకుండా ఫ్లెక్సీలు, బ్యాన‌ర్లు క‌ట్టారంటూ విమ‌ర్శించారు. ఈ పోస్ట్ ల‌ను ఆధారంగా చేసుకుని జీహెచ్ఎంసీ అధికారులు కౌశిక్ రెడ్డికి ప‌ది లక్షల ఫైన్ వేశారు. వంద‌లాది కార్లతో ఆయ‌న ర్యాలీగా రావ‌డంతో ట్రాఫిక్ భారీగా స్తంభించిపోయింది.

About Author