ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
1 min readపల్లెవెలుగువెబ్, చాగలమర్రి: అంగన్వాడి టీచర్లకు కనీస వేతనం 26 వేల రూపాయలను, తెలంగాణ రాష్ట్రంలో పెంచిన జీతాలు మాదిరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇవ్వాలని అలాగే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఏఐటీయూసీ అనుబంధ సంస్థ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు చంద్రకళ ప్రభుత్వాన్ని కోరారు. గురువారం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సంబంధిత తహసీల్దార్ కార్యాలయం ఎదుట ప్రభుత్వానికి కోరుతూ డిప్యూటీ తహసిల్దార్ శివశంకర్‌రెడ్డి కు మెమరాండం అందజేశారు.అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అంగన్వాడి టీచర్లకు పీఆర్సీ అమలు చేయాలని, పెన్షన్ రిటైర్మెంట్ బెనిఫిట్స్, చనిపోయిన అంగన్వాడీ కార్యకర్తల కుటుంబంలో ఉద్యోగం ఇవ్వాలన్నారు. 2018 నుండి నేటి వరకు డి ఏ,లు చెల్లించాలని, రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని, మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ సెంటర్ లు గా మార్చాలని కోరారు. సమస్యలన్నిటిని పరిష్కరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని మెమోరండం ద్వారా తెలియజేశారు . ఈ కార్యక్రమంలో హసీనా, వహీదా, పద్మ, నాగమణి, మై మూన్, సుజాత,ఇందుమతి తదితరులు పాల్గొన్నారు.